News

భూములు స్వాధీన పరచాలని లాతూర్‌ రైతులకు వక్ఫ్‌ బోర్డు నోటీసులు

249views

తాము తరతరాలుగా సాగు చేసుకుంటున్న సుమారు 300 ఎకరాల భూములను స్వాధీనం చేయాలని వక్ఫ్‌ బోర్డు ట్రైబ్యునల్‌ నోటీసులు పంపించినట్టు మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లా రైతులు తెలిపారు. వాటిని వక్ఫ్‌ ఆస్తులుగా పేర్కొంటూ ఛత్రపతి శంభాజీనగర్‌లోని రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ట్రైబ్యునల్‌ నుంచి 103 మంది రైతులకు నోటీసులు అందాయి. అవి వక్ఫ్‌ ఆస్తులు కావని, తరతరాలుగా తాము సాగు చేసుకుంటున్నవని రైతులు చెప్పారు. దీనిపై ఇప్పటికే ట్రైబ్యునల్‌లో రెండు సార్లు విచారణ జరిగిందని, ఈ నెల 20న మరోసారి విచారణ జరగనుందని తెలిపారు.