News

హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో పాడేరు లో భారీ ర్యాలీ

72views

బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగుతున్న దాడులను అరికట్టాలి బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యా, హత్యాచారాలను అరికట్టాలని హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సాయిబాబా గుడి దగ్గర నుంచి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం హిందూ ఐక్య వేదిక కన్వినర్ మినుముల గోపాలపాత్రుడు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆ దేశంలో ఉన్నా హిందూ, క్రైస్తవ మైనారిటీ ప్రజలపై మూక దాడులు పెరిగాయన్నారు.ముఖ్యంగా హిందూలపై అత్యాచారాలు, హత్యలు పెట్రేగి పోయాయాని ఆవేదన వ్యక్తం చేసారు.అనేక మందిని హింసిస్తూ కొంతమంది ఉగ్రవాద ముష్కరులు మానసిక ఆనందం పొందుతున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నిరసన ర్యాలీలో భాగంగా అల్లూరిజిల్లా లోని పాడేరు పట్టణంలో ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు.అక్రమంగా అరెస్ట్ చేసిన ఇస్కాన్ ప్రచారక్ కృష్ణ దాస్ ను వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేసారు.ఆపదలో వున్నా బంగ్లాదేశ్ కు సహాయం చేసిన ఇస్కాన్ సంస్థను ఉగ్రవాద సంస్థగా అభివర్ణించడం సమంజసం కాదని అన్నారు.

ఈ కార్యక్రమంలో హిందూ ఐక్య వేదిక ధార్మిక ప్రతి నిధులు కురుస ఉమామహేశ్వర రావు, పాంగి రాజారావు, సల్ల రామకృష్ణ, శాంతకుమారి,రాఘవేంద్రరావు,మత్స్య కొండబాబు, ఏంఏంఎల్ పాత్రుడు, అంగనైని ఆనంద్, సూర్య, యోగి, కామరాజు, మచ్చమ్మ, రవి చంద్ర, గణేష్ తదితరులు పాల్గొన్నారు.