News

తల్లిదండ్రులకు పాదపూజ

73views

సంస్కృతికి పట్టం కడుతూ శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని విద్యారణ్య ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో మాతాపితృ వందనం, మాతృ హస్తేన భోజనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పిల్లలు పాదపూజ చేశారు. అనంతరం తల్లిదండ్రులు స్వహస్తాలతో పిల్లలకు భోజనం తినిపించారు. తల్లిదండ్రులను పూజించడం, పెద్దలను గౌరవించడం పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు కావాలని వక్తలు అన్నారు. కార్యక్రమంలో పాఠశాల సమితి అధ్యక్షుడు కట్ట రత్నయ్య, కార్యదర్శి జయప్రకాష్‌, ప్రధానాచార్యులు సుబ్రహ్మణ్యం, బద్రీనాథ్‌, బాలాజీ, దేవాంగం శంకరప్ప, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.