
192views
తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని తితిదే నిర్ణయించింది. గత కొంతకాలంగా కొందరు రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోంది.
ఈ నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని తితిదే బోర్డు ఇటీవల తీర్మానించింది. దీన్ని తాజాగా అమలులోకి తీసుకువచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.





