News

సనాతన ధర్మ పరిరక్షణకు లోక్‌ మంథన్‌లు మరిన్ని జరగాలి: గజేంద్రసింగ్ షెకావత్‌

146views

భారతదేశ చరిత్ర చూస్తే వేల సంవత్సరాల ఇతిహాసం, సంస్కృతి, ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా ఉందని కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు. మన విజ్ఞానాన్నంతటినీ ధ్వంసం చేశారన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని దేశం నిలబడిందని.. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఇలాంటి లోక్‌ మంథన్‌ కార్యక్రమాలు మరిన్ని జరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ఎన్ని విధ్వంసాలు జరిగినా భారత ధర్మం, సంస్కృతిని మరిచిపోలేదు. లోక కల్యాణం నుంచి విశ్వ కల్యాణం వరకు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడమే మన ధర్మం. భారతదేశం సంస్కృతి, విభిన్న జాతులు, విభిన్న శైలి సంస్కృతులతో కూడిన దేశం. మన ఋషులు అమూల్యమైన సంపదను అందించారు. చెట్లకు పూజలు చేయడం వెనుక ఒక శాస్త్రీయ కోణం ఉండేది. గతంలో జరిగిన విధ్వంసం నుంచి భారత్‌ ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం సంతరించుకుంటోంది’’ అన్నారు.