News

గోవిందా? ఇది బాగుందా?

981views

తిరుమల ఆలయ వ్యవహారంలో పదే పదే వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా బయటపడ్డ ఒక సంఘటన సంచలనం రేపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సొమ్ముతో ముద్రించిన”భక్తి గీతామృత లహరి” అనే పుస్తకంలో 184వ పేజీలో అన్య మతస్థుల భగవంతుని కీర్తిస్తూ ఒక పాట ప్రచురించారు. ఇది 2002లో ముద్రించ బడింది. ఇప్పుడు దానిపై వివాదం రేగింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై హైదరాబాదుకు చెందిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చట్టపరమైన చర్యలకు పూనుకున్నది. భక్తుల, హిందూ సంస్థల ఆగ్రహానికి తలవంచిన తితిదే తన అధికారిక వెబ్సైట్ నుంచి దానిని తొలగించింది. ఇది భక్తుల, హిందూ సంస్థల సంయుక్త విజయం.

వేంకటేశ్వర స్వామి భక్తి గీతాలు ఉండవలసిన పుస్తకంలో అన్య మతస్థుల భక్తి గీతాలు ఎలా వచ్చి చేరాయని ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది నిన్న మొన్నటి వరకు TTDలో హాయిగా పెత్తనం చేసిన అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా చేసిన పని కావచ్చునని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి TTDలో ఎవరైనా బాధ్యత వహిస్తారా? లేక ప్రచురణ సంస్థ వారి తప్పని వారి మీద తోసేస్తారా? సంబంధిత ప్రచురణ విభాగం వారు ఇంత పెద్ద తప్పును ఎలా గుర్తించలేదు? ఏది ఏమైనా దీనిపై విచారణ జరిపించాలని, భాద్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాజకీయ నాయకులతో నిండిన పాలక మండళ్లు ఉండటమే ఈ ఉదాసీనతకు,నిర్లక్ష్యానికి కారణమని ప్రజలు భావిస్తున్నారు. మరి ప్రస్తుత పాలక మండలి కూడా గతంలో లానే తప్పించుకోజూస్తుందా? లేక ప్రజల మనోభావాలను గౌరవించి విచారణకు అదేశిస్తుందా? వేచి చూడాలి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.