
261views
విశ్వ హిందూ పరిషత్-వీ.హెచ్.పి ఆధ్వర్యంలో హైందవ శంఖారావం బహిరంగసభ జనవరి 5,2025న విజయవాడలో జరుగుతున్న సందర్భంగా నవంబర్ 3న చిత్తూరులోని తిలక భవన్ లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ అనుబంధసంస్థల సమావేశం జరిగింది. ప్రభుత్వ నియంత్రణ నుండి హిందూ దేవాలయాలను విముక్తి కల్పించి స్వయంప్రతిపత్తి కలిగిన ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్టసవరణ చేయాలని కోరుతూ హైందవ శంఖారావం బహిరంగసభను విజవంతం చేయడంకోసం హిందువులందరు వేలాదిగా తరలిరావాలని ఆంధ్రప్రదేశ్ సహకార్యవాహ మాలపాటి శ్రీనివాసరెడ్డి పిలుపిచ్చారు. వీ హెచ్ పి మహిళాప్రముఖ్ మురలమ్మ, విభాగ్ సంఘచాలక్ రవీంద్రన్, విభాగ్ ప్రచారక్ మల్లికార్జున్, జిల్లాకార్యవాహ హరికృష్ణ, జిల్లా అధ్యక్షులు సురేంద్రరెడ్డి, ప్రాంత మహిళా సమన్వయప్రముఖ్ శ్రీదేవి, జిల్లా నలుమూలలనుండి హిందూ సంఘాల పెద్దలు పాల్గొన్నారు.





