News

శ్రీశైలక్షేత్రాభివృద్ధికి కృషి

247views

శ్రీశైల మహాపుణ్యక్షేత్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని దేవస్థానం నూతన ఈఓ ఎస్‌.ఎస్‌.చంద్రశేఖర ఆజాద్‌ అన్నారు. ఇన్‌చార్జి ఈఓ చంద్రశేఖరరెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకొని మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన దర్శనాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. పర్యావరణ పరిరక్షణ, క్షేత్ర సుందరీకరణలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందిస్తామన్నారు.