News

భావి తరాల కోసం కళల పరిరక్షణ

228views

భారతీయ సంస్కృతికి, సాంప్రదాయానికి మార్గదర్శకమైన కళలను పరిరక్షించి భావితరాలకు అందించాలని వేదిక్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ రాణి సదాశివమూర్తి తెలిపారు. టీటీడీ హిందూ ధర్మపరిషత్‌ సౌజన్యంతో శ్రీపద్మనాభ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వారు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న నాటకోత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ రామాయణం, భారతం, భాగవతం వంటి ఇతిహాసాలను తెలిపే కళారూపాల వైభవాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరముందన్నారు. అనంతరం అతిథితో పాటు కళాకారులను జ్ఞాపికలతో నిర్వాహకుడు కస్పా పద్మనాభన్‌ ఘనంగా సత్కరించారు. గుండాల గోపీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.