News

అయోధ్యకు స్వయం సేవకుల సైకిల్ యాత్ర

233views

బెంగుళూరు నుండి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌కు చెందిన 13 మంది వాలంటీర్లు రెండు వేల కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి బాల రాముని దర్శనం కోసం అయోధ్యకు చేరుకున్నారు. వారి సైకిల్ యాత్ర పద్దెనిమిది రోజుల్లో గమ్యాన్ని చేరుకుంది. దారి పొడవునా, ఈ బృందం ఉదయం లేదా సాయంత్రం ఏదైనా కొత్త ప్రదేశంలో సౌకర్యాన్ని బట్టి శాఖను ఏర్పాటు చేసి, సంఘ్ గురించి కొత్త వ్యక్తులకు తెలియజేసి దేశభక్తి గీతాలను ఆలపిస్తూ యాత్రను నిర్వహించడం విశేషం.

మరపహళ్లి బాగ్ జిల్లా సామాజిక సామరసత సంయోజక్ శ్రీనివాసన్ ఆధ్వర్యంలో ఈ బృందం ఈ యాత్రను చేపట్టింది.ఈ విషయంపై ఆయన స్పందిస్తూ, సంఘ్ కార్యాలయంలో రాత్రి విశ్రాంతి తీసుకునే విధంగా సైకిల్ యాత్రకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. అక్కడి నుండి తెల్లవారుజామున, దారిలో ఉన్న ఒక గ్రామం లేదా పట్టణంలో ఒక శాఖ ఏర్పాటు చేసి సైకిల్ ప్రయాణం కొనసాగించామన్నారు.సైకిల్ చెడిపోయినప్పుడు లేదా ఎవరైనా గాయపడినప్పుడు సహాయం అందించడానికి ఒక స్వయం సేవకుడు మోటారుసైకిల్‌పై వచ్చారని చెప్పారు.

ఈ బృందం విజయవంతంగా అయోధ్య చేరుకుని బాల రాముని దర్శనం చేసుకొని సైకిల్ యాత్ర ముగించింది.