
తిరుమల తిరుపతి దేవస్థానం, ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యాన ఈ నెల 9, 10 తేదీల్లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల వారికి భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహిస్తు న్నట్లు ప్రోగ్రామ్ అసిస్టెంట్ సీవీకే ప్రసాద్ తెలిపారు. పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మసంయమ యోగం అంశంగా జూనియర్, సీనియర్ విభాగంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంపూర్ణ భగవ ద్గీత పోటీలు 9వ తేదీ మధ్యాహ్నం 3 గంట లకు పున్నమ్మ తోటలోని టీటీడీ కల్యాణ మండపంలో, 6,7,8,9 తరగతులు వారికి 10వ తేదీ ఉదయం 10 గంటలకు చుట్టుగుంట సెంటర్లోని లయన్స్ క్లబ్ హాల్లో జరుగు తాయని వివరించారు. సమావేశంలో టీటీడీ కల్యాణ మండపం మేనేజర్ భాస్కరరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా ధర్మప్రచార పరిషత్ బాధ్యులు బీవీ బాల కోటేశ్వరరావు, నండూరి తాండవ కృష్ణ పాల్గొన్నారు. వివరాలకు సీవీకే ప్రసాద్ 70322 55499 లో సంప్రదించాలని సూచించారు. భగవద్గీత పోటీల బ్రోచర్ ను అతిథులు ఆవిష్కరించారు.





