
405views
ఏలూరు జిల్లాలోని పంచారామక్షేత్రం పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో అయోధ్యలో రాముడికి అలంకరించనున్న ధనుస్సుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాత చల్లా శ్రీనివాసశాస్త్రి మాట్లాడుతూ ఈ ధనుస్సును 13 కేజీలు వెండి, 1 కేజీ బంగారంతో చైన్నెలో నాలుగు నెలలు క్రితం తయారు చేయించినట్లు తెలిపారు. దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలకు ఈ ధనస్సును తీసుకువెళ్లి పూజలు చేయించి, వచ్చే ఏడాదికి అయోధ్య రాముడికి అలంకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు తదితరులు పాల్గొన్నారు.





