146
నంద్యాల జిల్లా, స్థానిక సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుక బడిన కుటుంబాల పిల్లలకు అభ్యాసికల పేరుతో 20 ఉచిత ట్యూషన్ సెంటర్లు నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా నంద్యాలోని అయ్యలూరు గ్రామం సోమవారం “సుభాష్ చంద్రబోస్ అభ్యాసిక” తల్లిదండ్రుల సమావేశం తల్లి దండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యాభివృద్ధితో పాటు సంస్కారాభివృద్ది పెంపొందేలా ఉపాధ్యాయులతో పాటు తల్లి దండ్రులు కూడా కృషి చేయాలని కోరారు.
సంస్కారాభివృద్ది ద్వారా విద్యార్థుల తల్లి దండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో సకారాత్మక మార్పులు గమనించినట్టు తెలపడం విశేషం.
ఈ కార్యక్రమంలో సంఘమిత్ర కమిటీ సభ్యులు సీనియర్ వైద్యులు డా.కె.ఉదయ్ శంకర్, వివి రమణయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ ఆర్.ఓబులేసు మరియు అట్ల.పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.