
235views
కర్నాటకలోని బెళగావిలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు బ్యానర్ కలకలం రేపింది. బెళగావిలోని సాహు నగర్లో గుర్తుతెలియని వ్యక్తులు మెయిన్ రోడ్డు పక్కనే ఔరంగజేబు బ్యానర్ ఏర్పాటు చేశారు. సుల్తాన్-ఎ-హింద్, ది రియల్ ఫౌండర్ ఆఫ్ అఖండ్ భారత్ అని ఈ బ్యానర్లో ఔరంగజేబును ఆకాశానికెత్తేశారు.
ఔరంగజేబు జయంతి సందర్భంగా ఈ బ్యానర్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది.మత విద్వేషాలను రెచ్చగొట్టి, ఘర్షణలు చెలరేగే విధంగా కుట్ర పన్ని ఈ బ్యానర్ను ఎవరో దురుద్దేశపూర్వకంగా ఏర్పాటు చేశారని స్థానికులు మండిపడ్డారు.





