News

కెనడాలో ఆలయ దాడిపై.. స్పందించిన భారత విదేశాంగ శాఖ

73views

బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై ఇటీవల జరిగిన దాడిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం.. తీవ్రవాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తోందని ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన ఆస్ట్రేలియాలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్తాన్ తీవ్రవాదులు.. హిందూ ఆలయంపై దాడి చేశారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా నిరాధారమైన ఆరోపణలు చేసింది. కెనడా అక్రమంగా భారతీయ దౌత్యవేత్తలను నిఘాలో ఉంచింది. కెనడా భారత్‌పై ఆరోపణలు చేసే విధానాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. కెనడా భారత్ దౌత్యవేత్తలు నిఘా ఉంచింది. ఇది ఆమోదయోగ్యం కాని విషయం. కెనడా తీవ్రవాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తోందని భావిస్తున్నా. కెనడాలో జరిగిన దాడి ఘటన భారత్‌కు ఆందోళన కలిగించింది’’ అని అన్నారు.