
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 24న వాషింగ్టన్‌లో హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ విద్యావేత్త, వాల్‌స్ట్రీట్ జర్నల్ సీనియర్ కాలమిస్ట్ వాల్టెర్ రస్సెల్ మీడ్‌తో ముఖాముఖిలో ఆరఎసఎస్ వందేళ్ల ప్రస్థానాన్ని సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలే వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సంస్థ విస్తరణపై మాట్లాడారు. దాని సంస్కృతిని, ఉనికిని, సేవను అర్థం చేసుకోవడాన్ని వెల్లడించారు. ఆరఎసఎస్ పట్ల పాశ్చాత్య అపోహలను కాదన్నారు. సంస్థను ప్రజలు స్వచ్ఛందంగా చేపట్టిన ఒక ఉద్యమంగా తెలిపారు. హిందువులు ఆధిపత్యవాదులు అంటూ వస్తున్న ఆరోపణలను విస్పష్టంగా తోసిపుచ్చారు. ముఖాముఖిలో ముఖ్యాంశాలు..
సదస్సులో పాల్గొనటం వల్ల మీకు ఎలాంటి అనుభవం ఎదురైంది?
సదస్సులో భాగం కావడం పట్ల నేను సంతోషిస్తు న్నాను. ఇందులో అనేక మంది ప్రముఖుల ప్రసంగా లను వినడంతో విద్యారంగానికి సంబంధించిన ఒక కసరత్తు చేసినట్టుగా అనిపించింది. సదస్సులో కార్యక్రమాలు ఆసక్తికరంగా, విషయం పట్ల మంచి అవగాహనను కలిగించేవిగా ఉన్నాయి. ఈ సదస్సుకు నన్ను ఆహ్వానించి, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ గురించి నాకు మాట్లాడే అవకాశం కల్పించిన హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌కు ధన్యవాదాలు. ఇక్కడి ప్రజలను కలుసుకోవడానికి, వారితో మాట్లాడటానికి నేను ఇక్కడికి వచ్చాను. స్టాన్‌ఫోర్ట్‌లో జరిగిన సదస్సులో కూడా పాల్గొన్నాను. అక్కడి చర్చలు సైన్సు, సాంకేతి కత, అంతర్జాతీయంగా ఆరోగ్యం, సుస్థిరతలపై దృష్టి పెట్టాయి.
వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ నేడు దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నది?
జాతికి, సమాజానికి ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవకు 100 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. భారత్‌లో అనేకమందిని మేం చేరుకున్నాము. అమెరికా సహా పశ్చిమ దేశాలు, ఇతర దేశాలలో వేర్వేరు వర్గాల ప్రజలతో మమేకం కావడం ద్వారా వారిని ప్రభావితం చేయడం కూడా అవసరం అని మేం భావించాం. ఇలాంటి విదేశీ పర్యటనల ద్వారా ఆరఎసఎస్, దాని పనితీరు గురించి తెలియపరచడానికి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు, మేధావులతో సంభాషించే అవకాశం నాకు దక్కింది.
ప్రపంచంలో అత్యంత పెద్దవైన సంస్థలలో ఒకటిగా ఆర్ఎస్ఎస్ ఉన్నప్పటికీ పాశ్చాత్య దేశాలలో దాని పట్ల అవగాహన పేలవంగా ఉంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ దైనందిన కార్యకలాపాలను వివరించండి.
ఆర్ఎస్ఎస్ అనేది భారతదేశ పురాతన సాంస్కృ తిక, నాగరిక విలువల నుంచి స్ఫూర్తి పొందిన స్వచ్ఛంద ప్రజా ఉద్యమ సంస్థ. ఈ స్ఫూర్తినే హిందూ తాత్వికత అని అంటారు. గడచిన 100 సంవత్స రాలుగా స్వయంసేవకులు అని మేం పిలుచుకునే స్వచ్ఛంద కార్యకర్తలను సృష్టించడంలో ఆర్ఎస్ఎస్ నిమగ్నమై ఉంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని సంతరించుకున్న ఒక సొసైటీని అది నిర్వహిస్తున్నది. వ్యక్తి త్వం, ఆత్మవిశ్వాసం, సమాజానికి సేవ చేయాలనే తత్వం, సంస్థను నిర్వహించే నైపుణ్యంతో కూడుకున్న స్వయంసేవకులను తయారు చేయడానికి దాదాపు 83,000 ప్రాంతాలలో రోజువారీ సమావేశాలను, మరో 30,000 ప్రాంతాలలో వారాంతపు సమావేశాలను ఆరఎసఎస్ నిర్వహిస్తున్నది. వాటినే మేము శాఖలు అని పిలుచుకుంటాము. ఈ గంటసేపు సమావేశంలో పాల్గొన్న వారిలో జీవన విలువలు, ఆత్మవిశ్వాసం, ఐక్యమత్య భావనను పాదుగొల్పుతాము. ఇదంతా సముహాం, జాతి ఐక్యత మెరుగుదల కోసం సామాజిక మానవ మూలధనాన్ని సృష్టించడం లక్ష్యంగా జరుగుతున్నది. శాఖలలో సమాజంలో అన్ని వర్గాలకు చెందినవారు, అన్ని వయసుల వారు పాల్గొంటారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అవసరార్థులకు ఆరఎసఎస్ సేవలు అందిస్తున్నది. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభి వృద్ధి, పర్యావరణం, తదితర రంగాల్లో కృషి చేస్తున్నది. ఆరఎసఎస్ స్వయంసేవకులు దాదాపు 40 పౌర సంస్థలను నెలకొల్పారు. వాటిలో అత్యధికం దేశవ్యాప్త సంస్థలుగా అవతరించి, జాతి నిర్మాణ కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నాయి.
డాక్టర్ హెడ్గేవార్ నివాసాన్ని సందర్శించిన ఘట్టం నాకు ఇంకా గుర్తు ఉంది. అప్పట్లో తొలి సమావేశానికి ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. ఒక చిన్న ఆరంభం నుంచి దేశవ్యాప్తంగా రోజూ 83,000 శాఖలు నిర్వహించే స్థాయికి ఈ సంస్థ ఎదిగింది. ఈ శాఖలకు ప్రజలను మీరు ఎలా సమీకరిస్తారు?
వ్యక్తిగత సంబంధాలు, ఒకరితో ఒకరికి పరిచయాలతో నిబద్ధత ఏర్పడుతుంది. రోజువారీ శాఖలు సోదరభావాన్ని, సామాజిక నిబద్ధతను, కర్తవ్య నిర్వహణ భావన, సమాజానికి నిస్వార్థంగా తిరిగి ఇవ్వాలనే ఆకాంక్షను కలిగిస్తాయి. అనుభవం, సామర్థ్యం ప్రాతిపదికగా బాధ్యతలను అప్పగించ డానికి, సంవత్సరం అంతా కార్యకలాపాలు చేపట్ట డానికి ఒక సంస్థాగత నిర్మాణం ఉంది. కానీ కడకు కార్యకలాపాలు కొనసాగడంలో నిబద్థత, సుహృద్భావ వాతావరణం కీలకమైన పాత్రను పోషిస్తాయి.
కొంతమేరకు ఆరఎసఎస్ అత్యంత వివాదాస్పద మైనది. మీ వరకు ఆర్ఎస్ఎస్ గురించి అమెరికన్లు ఎక్కడ తప్పుగా అర్థం చేసుకున్నారు?
అమెరికా కేవలం ఆర్ఎస్ఎస్ గురించే కాదు. భారతదేశం గురించి కూడా అపోహపడుతున్నది. భారత్ అధిక జనాభాతో, మురికివాడలతో, పేదరికంతో, పాములు, మురికివాడలు, స్వాములతో కూడిదని, భారతదేశం ఒక టెక్ హబ్ కూడా. భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. సాధారణ అమెరికన్ అవగాహనలో ఈ విషయాలు ఎందుకో విస్మరణకు గురవుతుంటాయి. అలాగే, ఆరఎసఎస్ గురించి, తెలిసిగానీ తెలియకగానీ, లేదా ఒక అజెండాలో భాగంగాగానీ సృష్టించిన కథనం ఏమిటంటే, ఆరఎసఎస్ ఒక హిందూ ఆధిపత్యవాది, ఒక విధంగా క్రైస్తవ వ్యతిరేకి, మైనారిటీ వ్యతిరేకి, మహిళల అభివృద్ధి వ్యతిరేకి అని. ఆధునీకరణ వ్యతిరేకి. ప్రజలు సానుకూలమైనవి కాకుండా వ్యతిరేకతను కలిగించే విషయాలనే ప్రచారం చేస్తారు.
ఈ భావనను మీరు ఎలా సవాల్ చేస్తారు? అది (ఆర్ఎస్ఎస్) ఒక హిందూ ఆధిపత్య సంస్థ అని ప్రజలు అన్నప్పుడు మీరు ఎలా స్పందిస్తారు?
హిందూ తాత్వికత, హిందూ సంస్కృతి ఆధిపత్యాన్ని అనుమతించవు. మేం మొత్తం ప్రపంచాన్ని ఒక కుటుంబంలాగా చూస్తాము. మానవులందరూ మాకు సోదరులు, సోదరీమణులు. ఆధిపత్యం అనే ప్రశ్నకు తావు లేదు. జీవుýలోనూ, నిర్జీవులలోనూ, ఇలా ప్రతిఒక్కదానిలోనూ ఏకత్వాన్ని చూస్తాము. అలాంటి ఒక తాత్వికత హిందువుల మÖలతత్వం అయినప్పుడు వారిలో ఆధిపత్య ధోరణి ఉండనే ఉండదు. అంతేకాకుండా చరిత్ర ప్రకారం చూసినప్పుడు హిందువులు ఏ దేశంపైనా దండయాత్ర చేయలేదు. ఎవ్వరినీ బానిసలుగా చేసుకోలేదు. హిందువులు ఒకరికి క్షమాపణ చెప్పే స్థితిలో లేరు.
భారతదేశం సాంస్కృతికంగా, ఆర్థికంగా ఆధునికీకరణ చెందే కార్యక్రమానికి ఆరఎసఎస్ చాలా దగ్గరగా ఉంది. కొన్ని సందర్భాలలో పురాతన మÖలాలను అనుభవిస్తూనే భవిష్యత్తుకు దారి తీసే ఆధునికీకరణ వేర్వేరు దిశలకు లాగుతున్నట్టు కనిపిస్తుంది. ఆ క్రమంలో తన మÖలలకు తిరిగి వెళ్లడానికి, భవిష్యత్తు వైపు చూడటానికి మధ్య సమతూకాన్ని ఆరఎసఎస్ ఎలా పాటిస్తుంది?
స్పష్టంగా చెప్పాలంటే సందర్భానుసారంగా ఉద్రిక్తతను సృష్టిస్తూ, పాటించాల్సినవిగా అనిపించే సాంస్కృతిక విలువలు, ఆధునికీకరణ పరస్పరం విరుద్ధమైనవి కావు. అవి ఏకకాలంలో మనుగడ సాగించగలవు. పారిశ్రామికీకరణ, సాంకేతికతలను తీసుకొనివచ్చే ఆధునికీకరణ సాంస్కృతిక విలువలతో కలిసి పనిచేస్తుంది. మనం ఈ ధోరణిని ఇటీవలి దశాబ్దాలలో భారత్, జపాన్ లేదా చైనా దేశాలలోని ఓరియంటల్ సొసైటీలలో చూశాము. ఆయా సొసైటీలు వాటి నాగరికతా విలువలను చెక్కుచెదర కుండా కాపాడుకుంటూనే ఆధునికీకరణను అవలంభించాయి.
హిందూ తాత్వికత సనాతనాన్ని ప్రతిపాదిస్తుంది. సనాతనం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది అని అర్థము. అది పురాతనమైది అయినప్పటికీ నిత్యమÖ వర్థిల్లుతున్నది. దీనికి తాత్వికమైన తార్కాణంగా మర్రిచెట్టును చెప్పుకోవచ్చు. నాగరికతా విలువలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా లోతైన, బలమైన వేళ్లు మర్రిచెట్టుకు ఉంటాయి. కానీ అదే చెట్టుకు అనేక కొమ్మలు ఉంటాయి. ప్రతి రుతువులోనూ కొత్త చిగురులు, ఆకులు పుట్టుకొస్తుంటాయి. పువ్వులు వికసిస్తుంటాయి. ఇది ఎంత కొత్తదనాన్ని సంతరించు కుంటుందో అంతే పురాతనత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంటుంది. సంస్కృతి, ఆధునీకకరణ కలిసి పోగలవు. అలాంటి కలిసిపోవడం అనేది సృష్టిలో ఒక భాగం.
అంతర్జాతీయ రాజకీయాల విషయానికి వస్తే.. భారత్‌ను ఒక అవిభాజ్య వ్యూహాత్మక భాగస్వామిగా, ఆసియా ఖండంలో ఎలాంటి విపత్కర పరిస్థితిని అయినా చక్కదిద్దే ఒక సమవర్తిగా అమెరికా చూస్తున్నది. ఈ పాత్రను పోషించడంలో సుస్థిరమైన ఆర్థిక, సామాజిక అభివృద్ధి భారత్‌కు అవసర మవుతుంది. తన పూర్తి సామర్థ్యాన్ని ఆవిష్కరిం చడంలో భారత్ ఏం చేయవలసి ఉంటుంది?
అన్ని దేశాలతోనూ మరీ ముఖ్యంగా అమెరికా లాంటి అగ్ర రాజ్యంతో సత్‌సంబంధాలను కలిగి ఉండాలని భారత్ కోరుకుంటుంది. ఎందుకంటే భారత్ పరిమాణం, జనాభా, సాంకేతికంగా ముందంజ, ఆర్థిక పరిపుష్టిని చూసినప్పుడు ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం(అమెరికా లాంటి దేశాలతో) సహజంగానే అవసరమవుతుంది. దీనిని సాధించడమనేది పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం, ఒకరి అవసరాలను మరొకరు గుర్తించడం ద్వారానే సాధ్యమవుతుంది. పరస్పరత్వం లేని పక్షంలో విశ్వాసం కొరవడుతుంది.
ఒక బలమైన భారత్‌కు పునాదిగా ఒక పటిష్టమైన హిందూ సంస్కృతి గుర్తింపు అవసరం అని ఆర్ఎస్ఎస్ చాలా కాలంగా వాదిస్తున్నది. అది భారత్‌లో మైనారిటీలను పరాధీనంలోకి పడిపోయే ముప్పును తీసుకువస్తుందా? లేకుంటే పొరుగు దేశాలతో సమస్యలను సృష్టిస్తుందా?
ఆరఎసఎస్ దృష్టిలో, హిందూ గుర్తింపు అనేది మతపరమైనది కాదు. అది ఒక నాగరికతా గుర్తింపు. ఆర్ఎస్ఎస్ ఎల్లప్పుడూ సాంస్కృతిక నైతిక విలువలు, నాగరికతా విలువలకు ప్రాధాన్యతనిచ్చింది. వీటికి ఏ మతంతోనూ ప్రత్యక్ష సంబంధం లేదు. రాజకీయ ప్రయోజనాలు, చరిత్రను తప్పుగా అర్థం చేసుకోవడం తదితర కారణాల వల్ల ఉద్రిక్తతలు అప్పుడప్పుడు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ వర్గాలన్నింటితో నిరంతర, సమగ్ర సంభాషణలు అపోహలను తొలగించడంలో కచ్చితంగా సహాయపడతాయని ఆరఎసఎస్ విశ్వసిస్తుంది. ఆరఎసఎస్ ఒక మైనారిటీ వర్గం, వారి నాయకత్వంతో అటువంటి సంభాషణలలో నిమగ్నమై ఉంది. పొరుగు దేశాల మధ్య వివిధ కారణాల వల్ల, ఆ దేశాల రాజకీయ నాయకత్వం వల్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గత దశాబ్దాలలో చాలాసార్లు పరస్పర సంబంధాలు, విశ్వాసం దెబ్బతిన్నాయి. ఒక పొరుగు దేశంతో మాత్రమే సమస్య ఉంది. అది భారత గర్భం నుండి పుట్టిన తర్వాత పొరుగు దేశంగా మారింది. కానీ ఆ దేశం ద్వారా సమస్యలు సృష్టించడానికి దాని వెనుక చాలా మంది ఉన్నారు.
నాగరికతా గుర్తింపు గురించి మీరు మాట్లాడు తున్నప్పుడు అమెరికాలో యూదుల వ్యవహార శైలి నాకు గుర్తుకు వచ్చింది. వారిలో కొందరు ధార్మికతకు కట్టుబడి ఉంటారు. మరికొందరు ప్రపంచ దృక్కోణం లేదా ఆహారం ద్వారా మతాన్ని సాంస్కృతికంగా అనుసరిస్తుంటారు. భారత్‌లో హిందూ ధర్మాచరణను సైతం మీరు అదేవిధంగా భావిస్తున్నారా?
కొంతవరకు అలాగే ఉండవచ్చును కానీ పోలికలు ఎప్పుడూ కూడా నూటికి నూరు శాతం కచ్చితంగా ఒక్కలాగా ఉండవు. సుసంపన్నమైన సుదీర్ఘకాలపు చరిత్రలో ఉపనిషత్తులు, వేదాలు ప్రాతిపదికగా ఒక ప్రపంచ దృక్కోణాన్ని భారత్ అభివృద్ధి చేసుకుంది. ఆ కారణంగానే సమాజం, ప్రకృతి ప్రాతిపదికగా సామాన్య జనులకు దానిని వివరించిన సాధు, సత్‌పురుషులు ఈ నిర్దేశిత ప్రపంచ దృక్కోణం ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అది మన దైనందిన జీవనాన్ని నిర్దేశించింది. భారత్‌కు ఆత్మగా ఆధ్యాత్మికత ఉన్నది. ఆ ఆత్మ వ్యక్తీకరణగా భారతీయ సంస్కృతి విరాజిల్లుతున్నది.
గల్ఫ్ దేశాలు, ఇస్లాం ప్రపంచ దౌత్యంలో ఒక కీలకమైన పాత్రధారిగా తనను తాను పాకిస్తాన్ ఇటీవల ప్రకటించుకున్నది. ఈ పరిమాణాన్ని ఆరఎసఎస్ ఎలా అంచనా వేస్తుంది?
ఇలాంటి రాజకీయాలను ఆరఎసఎస్ పట్టించు కోదు. అయితే భారత్ ప్రయోజనార్థం భారత ప్రభుత్వం చేసే ప్రకటనలకు, వెలిబుచ్చే భావనలకు మేము మద్దతుగా ఉంటాము.
ఆర్ఎస్ఎస్ కు , భారత్‌లో పాలక పక్షానికి(బీజేపీ) మధ్య బంధం గాఢమైనది. ప్రధాని నరేంద్ర మోదీ తన జీవితంలో అధిక భాగాన్ని ఆరఎసఎస్‌లో ఒక చురుకైన కార్యకర్తగా గడపడానికి వెచ్చించారు. వందేళ్ల ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఆరఎసఎస్ తదుపరి కార్యాచరణ ఎలా ఉండనుంది?
అభినందన తెలిపిన మీకు ధన్యవాదాలు. మేం వృద్ధి చెందినప్పటికీ “బిగ్ బ్రదర్స” – పెద్దన్నలుగా మారలేదు. బలానికి తోడుగా అణకువ ఉండాలని హిందూ తాత్వికత బోధిస్తుంది. దానిని మేం ఆచరిస్తున్నాం. బలం, విజయం మమ్మల్ని వినయ సంపన్నులను చేస్తాయి. ఆ వినయాన్ని కలకలం కాపాడుకుంటాము.
కనుక వచ్చే దశాబ్దాలలో సమాజం, జాతి, మానవాళికి నిస్వార్థంగా సేవచేసే స్వయంసేవకులను సృష్టించే పనిని ఆరఎసఎస్ కొనసాగిస్తుందని వినయపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. “నిజమైన హిందువు హిందువుగానే ఉంటాడు. అతడు ప్రపంచ పౌరుడిగా అవతరిస్తాడు” అని నానుడి. ఈ నానుడిని ఆరఎసఎస్ విశ్వసిస్తుంది. వచ్చే శతాబ్దపు వాకిట నిలిచిన ఆరఎసఎస్ ఐదు కీలకమైన విషయాలపై దృష్టి పెట్టింది.
- సామాజిక ఐకమత్యం, సామరస్యం: భారతీయ సమాజంలో ఐకమత్యాన్ని సాధించడానికి వివక్షలను అధిగమించడం.
- పర్యావరణానుకుల జీవనం: ప్రకృతికి ప్రజలను చేరువ చేసే క్రమంలో, పచ్చదనంతో కూడుకున్న పరిశుభ్రమైన జీవనాన్ని(నీరు, విద్యుత్ వినియోగంలో ఆదా) సాధారణ ప్రజలకు అందించ డానికి చిన్నవైన, చేయదగిన పనులను ప్రోత్స హించడం.
- కుటుంబ విలువలు: భావి తరాలలో సాంస్కృతిక, మానవీయ విలువలను పాదుగొల్పడం. ఒక ఆరోగ్యకరమైన కుటుంబం ఒక ఆరోగ్యకరమైన దేశానికి భరోసా ఇస్తుంది.
- జాతీయ స్వావలంబన: మన షరతులకు లోబడి ప్రపంచానికి మన తలుపులు తెరుస్తూనే ఆర్థికం, భద్రత, తదితర రంగాలలో స్వావలంబన సాధించడం.
- పౌర విధులు: వ్యక్తులు, సామాజిక సమÖహాలలో పౌరసత్వ గుణాలు, సత్‌ప్రవర్తనలు, పౌర కర్తవ్యభావనను పాదుగొల్పడం.
ఇవి అన్నీ విశ్వజనీన విలువలు. ఎక్కడైతే దురవస్థ, కష్టాలు ఉంటాయో అలాంటి చోట మానవాళికి సేవ చేయడానికి ఒక దృఢమైన, ఆత్మవిశ్వాసంతో కూడుకున్న జాతి(దేశం) అవసరమని మేం విశ్వసిస్తాము.





