News

ఇంద్రకీలాద్రిపై గాజుల మహోత్సవం

166views

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో గాజుల మహోత్సవం ఎంతో అట్టహాసంగా ఆదివారం నిర్వహించారు. ప్రతి ఏట నిర్వహించే గాజుల మహోత్సవంలో భాగంగా అమ్మవారిని గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వర్ణమాల రంగులతో కూడిన అందమైన గాజులతో ఆలయం మొత్తాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. గాజుల అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. వివిధ రకాల గాజులతో ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు, ఉప ఆలయాలు, అమ్మవారి మూలవిరాట్ అను గాజులతో సుందరంగా అలంకరించారు. ఆలయంలోనే మహా మండపం ఆరవ అంతస్తు లో అమ్మవారి ఉత్సవాల విగ్రహాన్ని ప్రత్యేకంగా గాజులతో అలంకరించి, ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న గాజుల మహోత్సవం సందర్భంగా అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. వారాంతపు సెలవులకు తోడు కార్తీక మాసం ప్రారంభం, అమ్మవారు గాజుల అలంకరణలో ఉండడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఈవో ఎస్ రామారావు విస్తృత ఏర్పాట్లు చేశారు. కార్తీకమాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున కృష్ణానది తీరంలో పుణ్య స్నానాలు ఆచరించారు..