News

దాడులకు నిరసనగా బంగ్లాదేశ్‌ హిందువుల ర్యాలీ

210views

తమపై వరుసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ బంగ్లాదేశ్‌లోని హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. దాడులు, విద్వేష ఘటనల నుంచి రక్షణ కల్పించడంతో పాటు తమపై మోపిన దేశ ద్రోహ కేసులను ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. బంగ్లాదేశ్‌ ఆగ్నేయ ప్రాంతంలోని ఛత్తోగ్రామ్‌ నగరంలో శుక్రవారం నిర్వహించిన ఈ ప్రదర్శనలో సుమారు 30 వేల మంది పాల్గొన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇవే తరహా ప్రదర్శనలు జరిగాయి. ఆగస్టులో మాజీ ప్రధాని షేక్‌ హసీనా పదవీచ్యుతురాలు అయినప్పటి నుంచి హిందువులపై 2వేలకు పైగా దాడులు జరిగాయని నిరసనకారులు ఆరోపించారు. 19 మంది హిందూ నాయకులపై బుధవారం దేశద్రోహం కేసులు నమోదు చేయడం తాజా నిరసనలకు దారితీసింది.