News

వేద పండితులకు నిరుద్యోగ భృతి

278views

వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెలకు రూ.3వేల చొప్పున సంభావన రూపంలో చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 7 దేవాలయాల పరిధిలో మొత్తం 600 మంది వేద పండితులు ఉన్నారు. సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, శ్రీకాళహస్తి, ద్వారకతిరుమల, శ్రీశైలం, కాణిపాకం ఆలయాల్లోని పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.