
502views
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలోని నేమకల్లు గ్రామంలో ఆదివారం వాల్మీకి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. మండపంలో తొలుత అర్చకులు గణపతి పూజ, రక్షాంధనం, పంచగవ్యం, మండప పూజ, యంత్రాభిషేకం, జలాధివాసం, యంత్ర విగ్రహస్థాపన, బలిపూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు.
తర్వాత వేద మంత్రాల నడుమ విగ్రహాన్ని శ్రాస్తోక్తంగా ప్రతిష్ఠించారు. కార్యక్రమానికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ముఖ్య అథితిగా హాజరై పూజలు చేశారు. తర్వాత మాట్లాడుతూ.. శ్రీరాముని చరితను ప్రపంచానికి పరిచయం చేసిన వాల్మీకి మహర్షి అన్ని యుగాల్లో పూజ్యనీయుడని అన్నారు. చెడు నుంచి మంచికి మారి మహర్షి అయ్యారని తెలిపారు. ప్రతిఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.





