
సనాతన ధర్మం, ప్రపంచ శాంతి కోసం మహా నారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహాయాగం నిర్వహిస్తున్నట్లు కంచి పీఠాధిపతి అనంత శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాములవారు తెలిపారు . తిరుపతిలోని కంచి పీఠంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ శ్రీరామ జన్మస్థలం అయోధ్య నగరంలో 45 రోజులపాటు మహాయాగం జరుగుతుందని..నవంబర్ 18 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 1200 మందికి పైగా వేద పండితులు యాగంలో పాల్గొంటారని..యాగంలో ఉపయోగించే రెండు శ్రీరామ యంత్రంకు తిరుపతిలోని కంచి పీఠంలో పూజలు నిర్వహించామన్నారు. ఊరేగింపుగా తిరుపతి నుంచి అయోధ్యకు శ్రీరామ యంత్రంను తీసుకెళుతున్నట్లు చెప్పారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, శ్రీ కంచి కామకోటి పీఠం, చిన్మయి సేవా ట్రస్టుల ఆధ్వర్యంలో మహాయాగం నిర్వహిస్తున్నామన్నారు. ఈ యాగానికి టిటిడి సహకారం కూడా ఉందన్నారు.





