
445views
దేశ ప్రథమ ఉప ప్రధాని, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఆ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, సిబ్బంది రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయాలని, ఐక్యత, సమగ్రత, భద్రతా భావాల్ని పెంపొందించడానికి పోలీసులు కవాతును నిర్వహించాలని, సమాజంలోని అన్నివర్గాల భాగస్వామ్యంతో ‘రన్ ఫర్ యూనిటీ’ నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.





