
శ్రీశైలంలో ఘనంగా స్వర్ణరథోత్సవం బంగారు రథంపై ఆలయ మాడవీధులలో ఆది దంపతులు విహరింపు శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బంగారు స్వర్ణరథోత్సవం దేవస్థానం ఈవో ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణరథోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు అనంతరం స్వర్ణ రథోత్సవం ఆలయ రాజగోపురం నుండి ఆలయం మాడవీధులు హరిహర రాయి గోపురం బ్రహ్మానందరాయ గోపురం శివాజీ గోపురం మీదుగా మాడవీధులలో భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు మేళతాళాలతో వైభవంగా స్వర్ణరథోత్సవం జరిగింది స్వర్ణ రథోత్సవం ఆలయ మాడవీధులలో జరుగుతుండడంతో భక్తులు తరలివచ్చి స్వర్ణ రథోత్సవం తిలకించారు స్వర్ణరథం పై ఆసీనులైన శ్రీ స్వామి అమ్మవార్లు స్వర్ణ రథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు స్వర్ణ రథోత్సవంలో ఈవో. చంద్రశేఖర్ రెడ్డి అధికారులు స్థానిక పోలీసులు పాల్గొన్నారు ముందుగా వేకువజామునే శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించి అనంతరం మాడవీధులలో స్వర్ణరథోత్సవం నిర్వహించారు





