
322views
తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి సంబందించిన శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్ల 2025 జనవరి నెల కోటాను బుధవారం టీటీడీ విడుదల చేసింది. రోజుకు 500 టికెట్లు, 100 గదుల చొప్పున భక్తులకు అందుబాటులో ఉంచింది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని 2025 జనవరి 10 నుంచి 19వ తేది వరకు టికెట్ల విడుదలను వాయిదా వేశామని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు గమనించి ఆ తేదీలను మినాహాయించి ఆన్‌లైన్ లో టికెట్లను బుక్ చేసుకోవాలని కోరారు.