23views
అయోధ్య శ్రీరామమందిరం హుండీ చోరీ అంశాన్ని ఆధారంగా చేసుకుని పార్లమెంట్ ఆవరణలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ పప్పు యాదవ్ ప్రదర్శించిన స్కిట్ హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందంటూ వారిపై ఫిర్యాదులు నమోదయ్యాయి.
ఈ స్కిట్ ద్వారా శ్రీరామమందిరం, హిందూ ధర్మం, సన్యాస సంప్రదాయాలను అవమానించే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తూ వారణాసిలోని పలువురు న్యాయవాదులు వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. హిందూ విశ్వాసాలను కించపరిచే విధంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించడం ఖండనీయమని వారు పేర్కొన్నారు.
వారణాసిలో పలువురు సన్యాసులు, హిందూ సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు కలిసి రాహుల్ గాంధీ, పప్పు యాదవ్‌లకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. హిందూ ఆస్తికుల మనోభావాలను దెబ్బతీసే చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.





