News

భారతీయ సంస్కృతికి ఆధారం వైఖానస ఆగమం

335views

భారతీయ సంస్కృతికి ఆధారం వైఖానస ఆగమమేనని మైసూర్‌ మహారాజ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రాఫెసర్‌ పి.సత్యనారాయణ తెలిపారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో వైఖానస ఆగమోక్త అర్చనం అన్న అంశంపై జాతీయ సదస్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణం నుంచి ప్రాయశ్చిత్తాల వరకు వేదమంత్రాలతో ఇమిడి ఉన్నదే వైఖానసాగమమని చెప్పారు. అనేక గ్రంథాలు వైఖానస వాఙ్మయంలో మహర్షులు ఉపదేశించినప్పటికీ కొన్ని మాత్రమే ప్రస్తుతం లభ్యమవుతున్నాయని తెలిపారు. వీసీ కృష్ణమూర్తి మాట్లాడుతూ శ్రీవారికి అర్చనల వైఖానస ఆగమంలో చెప్పిన విధంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడుతూ అర్చనాజ్ఞానం వైదికులు, లౌకికులకు తెలియజేయాలన్నారు. అనంతరం ముఖ్యఅతిథులను ఘనంగా సత్కరించారు.