
361views
విజయనగరం పైడితల్లి అమ్మవారి తొలేళ్ల తంతు పూర్తయింది.. అసలు సంబరానికి వేళ అయింది. కొద్ది గంటల్లో అశేష జనవాహిని అత్యంత భక్తిశ్రద్ధలతో తిలకించే సిరిమానోత్సవం ఆరంభం కానుంది. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సిరిమాను బయలుదేరనుంది. ఇందుకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. అమ్మవారి పరివారంగా పిలిచే జాలరి వల, అంజలి రథం, పాలధార రథాలు సిరిమాను వెంట నడుస్తాయి. సాయంత్రం ఆరు గంటల సమయానికి సిరిమానోత్సవాన్ని పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం ఉదయం పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.





