News

భక్తిశ్రద్ధలతో తొలేళ్ల ఉత్సవం

366views

భక్తిశ్రద్ధలతో తొలేళ్ల ఉత్సవం పైడితల్లమ్మ తొలేళ్ల ఉత్సవం సోమవారం భక్తి శ్రద్ధలతో జరిగింది. పూసపాటి వంశీయులు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు, సతీమణి సునీలా గజపతిరాజు, కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పల్లకీ సేవలో పాల్గొన్నారు. ఆదివారం రాత్రి 10.35 గంటల సమయంలో అమ్మవారిని తొలేళ్ల ఉత్సవానికి సిద్ధం చేస్తూ వివిధ నదీజలాలతో అభిషేకించారు. * రైతులకు విత్తనాలు పంపిణీ సిరిమాను అధిరోహించే పూజారి బంటుపల్లి వెంకటరావు అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం విజయనగరం పరిసర ప్రాంత రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ విత్తనాలను తీసుకునేందుకు రైతులు అర్ధరాత్రి వరకూ వేచి ఉన్నారు. రాత్రి 12 గంటల సమయంలో ఈ ప్రక్రియ కొనసాగింది. ఈ తంతుతో తొలేళ్ల ఘట్టం పూర్తయింది.