News

కాశ్మీర్లో పరిస్థితులు  చక్కబడనివ్వండి – విపక్ష నేతలతో మాయావతి

761views

ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన విపక్ష నేతల తీరును బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి తప్పుబట్టారు.

రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు కాశ్మీర్ పర్యటనకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం అనుమతించకపోవటంతో వెనుదిరిగిన విషయం విదితమే.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 69 ఏండ్ల తర్వాత మొట్టమొదటిసారిగా కాశ్మీర్లో దేశ రాజ్యాంగం అమలవుతోందని, ఆ క్రమంలో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనడానికి కొంత సమయం పడుతుందని, కాశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొనే వరకు విపక్ష నేతలు ఓపిక పట్టి ఉంటే బాగుండేదని ఆమె హితవు పలికారు.  “జమ్మూ కాశ్మీర్లో ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో మీరు అక్కడకు వెళ్ళడం అవసరమా?” అంటూ ప్రశ్నించారు.

ఈ విషయమై ఆమె వరుస ట్వీట్లు చేశారు.