News

కాశ్మీర్ అంశాన్ని ఎలా డీల్ చెయ్యాలో మోడీకి బాగా తెలుసు – ట్రంప్

742views

జీ7 సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ల మధ్య జరిగిన భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ కాశ్మీర్ అంశాన్ని ఎలా డీల్ చెయ్యాలో మోడీకి బాగా తెలుసునని, కాశ్మీర్ సమస్య భారత్ అంతర్గత విషయమని అన్నారు. భారత్, పాక్ ల మధ్య ఉన్న సమస్యలను ఇరుదేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ట్రంప్ కోరారు.

కాశ్మీర్ ఎప్పటికీ భారత్ అంతర్భాగమేనని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. పాకిస్థాన్ తో తమకు ఎన్నో ద్వైపాక్షిక అంశాలు ముడిపడి ఉన్నాయని, అవి చర్చల ద్వారా పరిష్కారమవుతాయని తాము భావిస్తున్నామని, ఇరు దేశాల మధ్య ఏ ఇతర దేశం యొక్క జోక్యమూ అవసరం లేదని మోడీ స్పష్టం చేశారు.