NewsProgramms

చిన్ని కృష్ణుల పదస్పర్శతో పులకించిన మాధవ విద్యా విహార

129views

శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ సమితి,రాష్ట్ర సేవాసమితి గుడిలోవ వారి మాధవ విద్యా విహార అనకాపల్లిలో శ్రీకృష్ణ వేషధారణ పోటీలు(బాలగోకులం)23.08.2018 శుక్రవారంనాడు ఘనంగా జరిగింది. ఈకార్యక్రమాన్ని విజ్ఞానవిహార కమీటీ సభ్యులు శ్రీద్వారాపురెడ్డి పరమేష్ గారు ద్వీపప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కాండ్రేగుల విష్ణుమూర్తిగారు వచ్చారు. బీవీకే, సంయుక్త E.M పాఠశాల, సరస్వతీ విద్యాలయం, సాయి శక్తి E.M పాఠశాల ,ఇమ్మానియెల్ E.M పాఠశాల,మహాత్మజ్యోతిబాపూలే బాలుర గురుకుల  పాఠశాల , శ్రీచైతన్య E.M పాఠశాల,డి ఏ వి E.M పాఠశాల, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సత్యసాయి విద్యాలయం పాఠశాలల నుండి 63 మంది వేషధారణలో పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా బొడ్డు జోగారావు గారు,కృష్ణమూర్తిగారు వ్యవహరించారు.

విజేతలు :

మొదటి శ్రేణి : డి.మోక్షిత, ఆర్.శాన్వి,కె.ప్రణీత్.

రెండవ శ్రేణి: ఏ. మానస,సాయి కీరత్,వి.శశాంక్.

మూడవ శ్రేణి: కె.ఉమాదేవి,యన్ .యస్.యస్ పవన్ రాజా,యస్.కిరణ్ గణేష్.

డాక్టర్ కె. విష్ణుమూర్తిగారు,డి.పరమేష్ గారు,డాక్టర్.సింహాచలం నాయుడు గారు,ఆళ్ల శివ సత్యనారాయణగారు(విజయరామరాజుపేట గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్) శ్రీకాళహస్తి గారు,అచ్యుతాంబ గారు,దొడ్డి జగ్గారావుగారు,బొడ్డు జోగారావు గారు,కృష్ణమూర్తిగారు, అచ్యుత లక్ష్మి గారు విజేతలకు బహుమతి ప్రదానం గావించారు.  మాధవ విద్యా విహార ప్రధానాచార్య శ్రీనూకల అప్పలరాజు ఈ కార్యక్రమంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.