News

పాక్ కు మళ్ళీ షాకు

126views

పాకిస్థాన్ ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన సంగతి తెలిసిందే. పెట్టుబడులు రాక.. సరైన ఆదాయం లేక ఆ దేశ ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోతూ ఉంది. ఇప్పటికే పాకిస్థాన్ రూపాయి విలువ భారీగా పతనమైంది. పెట్టుబడుల కోసం ఆ దేశ ప్రధాని వేరే దేశాల్లో పర్యటిస్తున్నా ఎటువంటి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవరూ రావడం లేదు.

ఆర్థికంగా కుదేలైన పాక్ కు మరో షాక్ ఇచ్చింది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్). అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచడం ఈ సంస్థ చేసే పని..! టెర్రరిస్టు సంస్థలకు ఆర్థిక సాయం అందించడం, మనీ లాండరింగ్ కు పాల్పడటం వంటి కారణాలతో పాక్ ను బ్లాక్ లిస్ట్ లో ఉంచింది. ఒకవేళ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇచ్చిన డెడ్ లైన్ లోపు పాక్ తీరుమారకపోతే ఆ దేశ క్రెడిట్ ర్యాంకింగ్ ను ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ లు డౌన్ గ్రేడ్ చేస్తాయి. దీంతో అప్పులు పుట్టక మరింత దీన స్థితికి పాకిస్థాన్ వెళ్లిపోయే అవకాశం ఉంది.