నంద్యాల సంఘమిత్ర సేవా సమితి గత రెండు సంవత్సరాలుగా స్థానిక యన్ కొత్తపల్లి శ్రీ శారదా విద్యాపీఠం కేంద్రంగా పరిసర గ్రామాల విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది.ఈ సందర్బంగా పాఠశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ రెండవ బ్యాచ్ ను ప్రారంభించింది.
కే. నాగ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఈ సభలో స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీయస్ ప్రసాదరెడ్డి, సక్షమ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ నేట్ల మహేశ్వర రెడ్డి, నంద్యాల క్రిటికల్ కేర్ సెంటర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బీయస్ దిలీప్ కుమార్ రెడ్డి, సేవా భారతి రాష్ట్ర సహ కార్యదర్శి కే. మనోహర్, సంఘమిత్ర సహకార్యదర్శి కె.సుందర్ రావు, కార్యవర్గ సభ్యులు వెంకటయ్య అథితులుగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా అతిథులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంబించారు.కంప్యూటర్ పరిజ్ఞానం ఆవశ్యకతను గురించి విద్యార్ధులకు తెలియజేశారు. అనంతరం కంప్యూటర్ శిక్షణను లాంచనంగా ప్రారంభించారు.
ఈ సమావేశంలో సంఘమిత్ర వ్యవస్థాపకులు డాక్టర్ కె. ఉదయ్ శంకర్, ఉపాధ్యక్షులు జె. వెంకటేశ్వర్లు, కోశాధికారి సముద్రాల నాగ రాజయ్య, కార్య నిర్వాహక కార్యదర్శి జయశ్రీ, ఆవాస్ ప్రముఖ్ గంగాధర్, సేవా ప్రముఖ్ శ్రీనివాస్, కంప్యూటర్ ఉపాధ్యాయులు నరసింహ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు శైలజ, పాఠశాల కమిటీ ప్రభంద కారిణి, పాఠశాలల ప్రధానాచార్యులు, ఆచార్యులు, స్థానిక పెద్దలు, విద్యార్థులు, తల్లి దండ్రులు పాల్గొన్నారు.