News

తిరుమల యాత్రకని వెళితే… ఏలిన వారు జెరూసలెం యాత్రకు ఆహ్వానించారు

131views

తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ఆపాలని ఏనాటి నుండో హిందువులు పోరాడుతూ ఉన్నారు. అయినా అధికారుల కళ్లుగప్పి తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అది కూడా తిరుమల వెళ్లే బస్సులోనే.

తిరుమల భక్తులకు ఇచ్చే ఆర్టీసీ బస్ టికెట్ల వెనుక జరూసలేం యాత్రకు తక్కువ ఖర్చుతో తీసుకెళతామని ఓ ప్రకటన కనిపించింది. తక్కువ ఖర్చు, అన్ని సౌకర్యాలతో క్రైస్తవులకు పవిత్ర జరుసలేం యాత్ర అంటూ ఓ ప్రకటన ముద్రితమై ఉండటం భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఈ టికెట్లను పొందిన భక్తులు, ఆర్టీసీ అధికారులను నిలదీశారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చి పోయే ప్రయాణికులకు ఇస్తున్న టికెట్ల వెనుక అన్యమత ప్రచారం ఉండటంపై భక్తులు, హిందూ సంఘాలు  మండి పడుతున్నారు. ఈ ఘటనపై విచారణ చేయాలని వారు డిమాండ్ చేశారు.