
341views
విశ్వ హిందూ పరిషత్ షష్ట్యబ్ది ఉత్సవాలు ఆగస్టు 16 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించాలని వీహెచ్‌పీ కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ పేర్కొన్నారు.కర్నూలు నగరంలోని రెవెన్యూ కాలనీలోని భరత మాత మందిర ప్రాంగణంలో జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షష్టిపూర్తి సందర్భంగా ప్రతి ప్రఖండలో హిందూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. రాజకీయాలతో సంబంధం లేని ప్రముఖులను ప్రఖండ సమావేశాలకు ఆహ్వానించాలన్నారు. జిల్లా పరిధిలోని 12 ప్రఖండలలో ఘనంగా వేడుకలు నిర్వహించాలన్నారు. వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి భాను ప్రకాష్, నగర అధ్యక్షులు టీసీ మద్దిలేటి, రాష్ట్ర కోశాధికారి సందడి మహేష్, విభాగ్ ధర్మ ప్రసార్ విజయుడు, జిల్లా సహ కార్యదర్శులు గిరిబాబు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.





