
229views
విజయనగరంలోని సంతపేట, దాసన్నపేట, కొత్తపేటలో జగన్నాథస్వామి తొలి రథయాత్ర ఆదివారం వైభవంగా జరిగింది. సంతపేటలో ఉదయం 8 గంటలకు ఉత్సవ మూర్తులను రథంపై ఉంచారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లారు. దాసన్నపేటలో సుప్రభాతసేవ, విశేష అర్చనలు, నైవేద్యం, నీరాజనం అనంతరం క్రతువు సాగింది. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, నగర పాలక సంస్థ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆయా ఆలయాల కార్యనిర్వహణాధికారులు డీవీవీ.ప్రసాదరావు, వంశీలక్ష్మి ఏర్పాట్లను పర్యవేక్షించారు.





