
శ్రీరామకథ మృతసంజీవని… అంత మధు రమైనది మరొకటి ఉండదు… రామకథను చదవినా, విన్నా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రవచనకర్త వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వ రరావు అన్నారు. తెనాలి పట్టణానికి చెందిన శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తనా బృందం, సంకీర్తనా సేవాసమితి సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏర్పాటైన ప్రత్యేక సభలో ‘శ్రీరామనాము- శ్రీహనుమాన్ చాలీసా పారాయణ విశిష్టత’ అనే అంశంపై ఏర్పాటు చేసిన ‘ప్రవచనామృతం’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దాదాపు ఐదు వేలమందికి పైగా హాజరయ్యారు. సభలో బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.
పాపం మనయందు ఉన్నపుడు, భగదనుగ్రహం లేపుడు ఎలాంటి రక్షణ ఉండదని, మనంతట మనం ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా రక్షణ ఇవ్వలేవని చెప్పారు. రామనామం స్మరిస్తుంటే రామకథను చదివేలా చేస్తుందనీ, రామకథ పాతకాల నుంచి రక్షిస్తుందని అన్నారు. ఈశ్వరుడు ఏమి చేయవద్దని నిర్దేశించాడో వాటిని చేయటమే పాపమని చెబుతూ, కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు ఉన్పటికీ పంచ మహాపాతకాలను పోగొట్టే శక్తి భగవంతుని నామ స్మరణకు ఉంద న్నారు. ‘ఈశ్వరా..స్వర పేటికను ఇచ్చిన మీరే నా చేత భగవంతుడి నామసంకీర్తన చేసే భాగ్యం కల్పించు’ అని కోరుకోవాలని సూచించారు. నిర్గుణుడైన భగ వంతుడు ఒక్కోసారి ఒక్కో గుణాన్ని ఆవిష్కరించి నపుడు సంబంధిత నామం వస్తుందన్నారు. ఏ నామంతో పిలిచినా భగవంతుడు కదిలివస్తాడని చెబుతూ ప్రహ్లాద చరిత, గజేంద్ర మోక్షం అంశాలను గుర్తుచేశారు. అన్నింటిలోకెల్లా రామనామ వైభవం మరింత విశేషమైందని కోటేశ్వరరావు చెప్పారు.
రామాయణకాలం నాటికి పరమ గురు వైన శ్రీమహావిష్ణువు, శిష్యుడైన వశిష్ఠుడు దగ్గర శిష్యుడిగా ఉన్నాడని, ఇక్ష్వాకుల వంశానికి మేలుచేస్తూ మనందరికీ శ్రీరామనామం ఇచ్చి మహోపకారం చేశారని వివరించారు. తెలిసిగానీ, తెలియకగానీ రామనమం స్మరిస్తుంటే పాపాన్ని దహించి వేస్తుందన్నారు. రామనామ లేఖనం మహా తపస్సుగా చెప్పారు. శ్రీరామ అని ఎన్ని సార్లు రాస్తే అన్నిసార్లు ఆ నామాన్ని స్మరిస్తామని, విష్ణుసహస్ర నామం ఫలితం లభిస్తుందని వివరిం చారు. తొలుత శ్రీపంచముఖ ఆంజనేయస్వామికి విశేష అర్చనలు, అనంతరం శ్రీహనుమాన్ చాలీసా పారాయణ చేశారు.





