విజయవాడ దుర్గగుడిలో భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న సేవలపై ఈవో కేఎస్ రామరావు సోమవారం ఆరా తీశారు. ఆలయ ప్రాంగణంలోని ప్రసాదం కౌంటర్లు, క్లోక్ రూమ్ లు, చెప్పుల స్టాండ్లను తనిఖీ చేశారు. క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్లలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ తరఫున సిబ్బందితో మాట్లాడారు. భక్తుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరో వైపు గాలిగోపురం నుంచి క్యూలైన్ మార్గంలోకి ప్రవేశించిన ఈవో మార్గమధ్యలో భక్తులతో ఆలయ ప్రాంగణంలో ఇబ్బందులపై ఆరా తీశారు. వేసవి నేపథ్యంలో కూలర్లు, మంచినీటి సదుపాయంతో పాటు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇంకా ఏమైనా వసతులు కల్పిస్తే బాగుంటుందని బావిస్తు న్నారా అని అడిగి తెలుసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఉదయం 10.30 గంటల నుంచే అమ్మవారి అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నామని వెల్లడిం చారు. దర్శనం అనంతరం అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించాల్సిందిగా భక్తులకు సూచించారు. అన్న ప్రసాదం పంపిణీపై పదే పదే మైక్ అనౌన్స్ చేయాలని సిబ్బందికి సూచించారు. భక్తులకు ఏ విధమైన కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆలయ సిబ్బందికి సూచించారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
445views
You Might Also Like
ఆలయ ప్రదక్షిణ : భక్తి, వినయం, అంతర్ముఖతకు ఆధ్యాత్మిక మార్గం
హిందూ ధర్మంలో ప్రతి ఆచారానికీ ఒక అంతరార్థం ఉంటుంది. ఆలయానికి వెళ్లడం, గర్భాలయ దర్శనం చేసుకోవడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం, నమస్కరించడం వంటి ప్రతి సంప్రదాయమూ మనిషిని బాహ్య...
‘అద్వైతసిద్ధి’కి తెనాలి పరీక్ష
తెనాలి పరీక్ష". నేడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. ఇంతకీ ఏమిటీ పరీక్ష.. అంత కఠినంగా ఉంటుందా.. దేశం మొత్తమ్మీద ఒక్క తెనాలిలోనే ఎందుకు నిర్వహిస్తారు? ప్రధాని...
దయ చూపండంటున్నా.. మహిళకు షరియా శిక్ష 100 కొరడా దెబ్బలు
14
ఇండోనేషియాలోని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు అక్కడి అధికారులు దారుణమైన శిక్ష విధించారు. అచే ప్రావిన్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. బహిరంగంగా శిక్ష అమలు చేస్తున్న సమయంలో...
ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
11
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన 10 కిలోమీటర్ల రన్నింగ్ రేసులో పలువురు మహిళలు తలపై హిజాబ్ లేదా స్కార్ఫ్ ధరించకుండా పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా...
శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోండి.. విద్యార్థులకు అజిత్ డోభాల్ పిలుపు
34
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోభాల్ విద్యార్థులకు సూచించారు. ఇందుకోసం శ్రీరాముడి జీవితాన్ని ఆదర్శంగా...
పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
10
పాకిస్థాన్, తాలిబాన్ల మధ్య విభేదాలు మళ్లీ తీవ్ర రూపాన్ని దాల్చాయి. ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఒక భారీ తీవ్రవాద దాడి తర్వాత, ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌కు...





