
మన దేశంలో గ్యాస్ మరియు విద్యుత్ కొరత చాలానే వుంది. సోలార్ పవర్ కొంత కొరత తీరుస్తున్న … అందరికీ అందుబాటులోకి రావడానికి కాససత సమయం పడుతుంది. మనవద్ద లభించే తక్కువ ఖరీదు సాధనాల ద్వారా కాక… భారీ వ్యయంతో కూడిన సాధనల ద్వారా గ్యాస్ నేడు మనం ఉత్పత్తి చేసుకున్తున్నాం .పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టి జల విద్యుత్తును, డీజీలు లేదా బొగ్గు విపరీతంగా వాడి థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేసుకున్తున్నాం.ఇంత చేససనా మన అవసరాలకిది సరిపోవడం లేదు.
విదేశీ భావదాస్యంలో మునిగిన మనం మనదైన గోవంశం అందించే గోమయం., గోమూత్రంలోని అద్భుత శక్తిని అవహేళన చేశాం. గోమయం చేత గ్యాస్ ఉత్పత్తిని భారీగా చేపట్టవచ్చు. అలా బయటికి వచ్చే మడ్డి పదార్థం ఎంతో విలువైన సేంద్రీయ ఎరువుగా పంటలకు ఉపయోగించవచ్చు. గోమయ, గోమూత్రాలతో గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభిసశ్తీ దాని వల్ల ఎంతో వంట చెరుకు, పిడకలు మిగిలిపోతాయి.
అహ్మదాబాద్ సమీపంలోని ఈడర్‌లో గోబర్ గ్యాస్ తో కిర్లోస్కర్ ఇంజన్‌ను కలిపి విద్యుత్తు ఉత్పత్తి జరుగుతున్నది. అలా చిన్న చిన్న యూనిట్లు అంటే గ్రామ గ్రామాలలో ఇలాంటి ఉత్పత్తి చేపట్టి లేదా గోశాలలు “పశుకేంద్రాలు వున్న చోట్లలో ఇలాంటి ప్రయత్నాలు చేసస గ్రామీణ భాగంలో విద్యుత్ అవసరాలకు చాలా వరకు పూర్తిచేయవచ్చు. భారీయంత్ర సవమాగ్రితో హైడ్రో యూనిట్లను, థర్మల్ యూనిట్లను నెలకొల్పే బదులు చిన్న చిన్న యూనిట్లతో ఈ ఉత్పత్తిని పెంచడం నేటి అవసరం. ఇది సులభంగా, తక్కువ ఖర్చుతోను జరిగే పని. ఏ ప్రమాదాలు లేని పని. సమాజం ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయంసమృద్ధి సాధించ గలిగిన పని.





