News

కనుల పండువగా ఆది దంపతుల శోభాయాత్ర

292views

చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతుల వెండి రథం ఊరేగింపు కన్నుల పండువగా శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అధికారులు విజయవాడలో ఆదివారం నిర్వహించారు. గంగా, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను అలంకరించిన వెండి రథంపై ఉంచి స్థానాచార్య శివప్రసాద శర్మ పర్యవేక్షణలో అర్చకులు పూజలు నిర్వహించారు. ఈవో రామారావు కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మల్లికార్జున మహామండపం నుంచి కనకదుర్గానగర్‌, కుమ్మరిపాలెం, కామకోటినగర్‌, శంకరమఠం, సితార సెంటరు, టన్నెల్‌, చిట్టినగర్‌, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి మల్లికార్జున మహామండపానికి చేరింది. దారి పొడవునా భక్తులు ఆదిదంపతులకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఈఈ రమాదేవి, ఏఈవో రమేష్‌, వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాస శాస్త్రి పాల్గొన్నారు.