News

ఫిలిప్పీన్స్‌‌కు భారత్‌ బ్రహ్మోస్‌

364views

బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను భారత్‌.. ఫిలిప్పీన్స్‌కు అందజేసింది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక బంధానికి ఇది నిదర్శనం. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్‌లను అందించేందుకు రెండేళ్ల కిందట 37.5 కోట్ల డాలర్ల ఒప్పందాన్ని భారత్‌ కుదుర్చుకుంది. దీనికింద మన దేశం మూడు బ్యాటరీల క్షిపణులు, లాంచర్లు, సంబంధిత ఇతర పరికరాలను సరఫరా చేయాలి. బ్రహ్మోస్‌ క్షిపణికి సంబంధించి ఇదే తొలి ఎగుమతి ఆర్డర్‌. తాజాగా భారత వాయుసేనకు చెందిన సి-17 గ్లోబ్‌మాస్టర్‌ విమానంలో ఈ క్షిపణులను ఫిలిప్పీన్స్‌కు మన దేశం చేరవేసింది.