News

నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం

227views

ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. దేశంలో 2004-14తో పోలిస్తే 2014-23లో వామపక్ష తీవ్రవాద హింస 52 శాతం, మరణాల సంఖ్య 69శాతం తగ్గాయని పేర్కొంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు ఆపరేషన్‌లు చేపట్టాలని గతేడాది కేంద్రమంత్రి అమిత్‌ షా భద్రతా బలగాలకు నిర్దేశించడంతో శక్తిమంతమైన మావోయిస్టు వ్యతిరేక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో డీజీపీలు, సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ల డైరెక్టర్‌ జనరల్‌లు, ఇండో-టిబెటియన్‌ బార్డర్‌ పోలీసులు, ఇంటెలిజన్స్‌ బ్యూరో అధికారులున్నారు. ముందస్తు ఆపరేషన్‌ల ఫలితం ఇప్పుడు కనిపిస్తోందని అధికారి ఒకరు తెలిపారు.