News

ద్వారకాతిరుమలలో కల్యాణ మండపాల రుసుముల పెంపునకు నిర్ణయం

355views

ద్వారకాతిరుమల శ్రీవారి కొండపై, కొండ దిగువన భక్తులు వివాహాది శుభకార్యాలు జరుపుకునే దేవస్థానం కల్యాణ మండపాల రుసుములను పెంచేందుకు ధర్మకర్తల మండలి తీర్మానించిందని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు గురువారం ప్రకటనలో తెలిపారు. మండపాల నిర్వహణ, శానిటేషన్‌, విద్యుత్‌ వంటి ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పెరిగిన ధరలకు అదనంగా జీఎస్టీ, మెయింటినెన్స్‌ రుసుములను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కల్యాణ మండపాల రుసుముల పెంపుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే భక్తులు 15 రోజుల్లోపు 08829–271469, 271436 ఫోన్‌ నంబర్ల ద్వారా తెలియజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు