News

అర్చకులపై జరిగే దాడుల్ని అరికట్టాలి

225views

కాకినాడ శివాలయంలో పనిచేసే అర్చకులు సాయి శర్మ, విజయ్ కుమార్ శర్మలపై ఫాల్గుణ పౌర్ణమి నాడు గర్భగుడి వద్ద జరిగిన భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమైక్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యం.కె నాగరాజు డిమాండ్ చేశారు. స్థానిక అర్చకులను కాళ్ళతో తన్ని భౌతిక దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలన్నారు. నిందితుడికి మద్దత్తు ఇస్తున్న ఆలయ ఈఓ, కాకినాడ జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యం కె నాగరాజు రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మైనంపాటి చంద్రశేఖర్, అన్నదానం వెంకటరమణ, దేశాయ్ క్రిష్ణమూర్తి, కరణం వసంత కుమార్ డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోని పక్షంలో రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.