
బాలీవుడ్ హీరో, బీజేపీ ఎంపీ సన్నీడియోల్.. ఆపదలో ఉన్న ఓ మహిళను రక్షించి రియల్ హీరో అయ్యాడు. వివరాళ్లోకెళితే వీణా బేడి(45) అనే మహిళను ఓ నయవంచక ఏజెంట్ డబ్బుకోసం హౌస్‌కీపింగ్ జాబ్ పేరిట నెలకు రూ. 30వేలు జీతం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి కువైట్ పంపించాడు. అక్కడ పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తికి వీణాబేడిని బానిసగా అమ్మేశాడు. ఆ వ్యక్తి వణాను చిత్రహింసలు చేసేవాడు. అతడు పెట్టే బాధలు భరించలేక వీణా తన కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా విషయం తెలియజేసింది.
అయితే.. ఈ విషయం కాస్తా సన్నీడియోల్‌కు తెలిసింది. వెంటనే స్పందించిన ఆయన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించి కువైట్‌లో చిక్కుకున్న భారత మహిళను రక్షించాలని అభ్యర్థించాడు. అలాగే కువైట్‌లో ఉన్న రెండు భారత ఎన్‌జీఓల ద్వారా ఈ విషయమై సాయం చేయాలని కోరాడు. సన్నీ అభ్యర్థన మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎన్‌జీఓలు స్పందించడంతో సన్నీ చేసిన ప్రయత్నం ఫలించింది. దీంతో శుక్రవారం వీణా భారత్ కు తిరిగి రానుంది. ఇక ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సన్నీ డియోల్ గురుదాస్ పూర్ నుంచి బిజెపి ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Source : Bharath Today





