NewsProgramms

మాధవ విద్యా విహార పాఠశాల చిన్నారులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు

984views

రాష్ట్ర సేవాసమితి గుడిలోవ వారి అనకాపల్లి శ్రీరామనగర్ లో ఉన్న మాధవ విద్యా విహార పాఠశాలలో 31.07.2019 బుధవారం నాడు LKG నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు రాజా ఆప్టికల్స్ మరియు  కంటి ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్ పి.దేవిగారు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 35 మంది బాలాబాలికలకు పరీక్షలు నిర్వహించగా వారిలో  ఏడుగురికి కంటి సమస్య ఉన్నదని డాక్టరు గారు తేల్చారు. డాక్టరు గారు బాలబాలికల తల్లిదండ్రులను పిలిపించి వారితో పిల్లలకున్న కంటి సమస్యలను గూర్చి వివరించి, అవసరమైన వైద్య సహాయం గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ పూసర్ల రాజా, ప్రధానాచార్య నూకల అప్పలరాజు పాల్గొన్నారు.