
359views
పౌర్ణమి సందర్భంగా.. రేపు తిరుమలలో గరుడ కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమలలో పౌర్ణమి సందర్భంగా రేపు అంటే 2024 మార్చి 25న గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.
మరోవైపు నేటితో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ముగియనున్నాయి.. ఇవాళ తెప్పలపై భూదేవి సమేతుడైన మలయప్పస్వామి విహరించనున్నారు ఇవాళ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.





