News

పాకిస్థాన్ గడ్డపై కాలు మోపిన 500 మంది సిక్కులు

919views

సుమారు 500 మంది సిక్కులు మంగళవారం మధ్యాహ్నం దేశ సరిహద్దులను దాటారు. పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టారు. గురునానక్ 550వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని వారు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల నాన్కన సాహిబ్ ను సందర్శించబోతున్నారు. ఈ నాన్కన సాహిబ్ లోనే గురు నానక్ జన్మించారు. శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు సర్దార్ గోబింద్ సింగ్ లొంగోవాల్, ఢిల్లీ గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ మన్జీందర్ సింగ్ సిర్సా నేతృత్వం వహిస్తున్నారు.

తమ దేశంలో అడుగు పెట్టిన ఈ సిక్కుల ప్రతినిధుల బృందం సభ్యులకు పాకిస్థాన్ సాదర స్వాగతం పలికింది. దౌత్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి వారందరికీ ఇదివరకే వీసాలను జారీ చేసినట్లు భారత్ లోని పాకిస్తాన్ రాయబార కార్యలయం అధికారులు వెల్లడించారు.