News

దేవాలయాల బిల్లును తిప్పి పంపిన కర్ణాటక గవర్నర్

186views

దేవాలయాల నుంచి సంక్షేమ నిధిని వసూలు చేసేందుకు రూపొందించిన బిల్లును కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ తిప్పి పంపారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాల నుంచి 5 శాతం, రూ.కోటి ఆదాయం ఉన్న దేవాలయాల నుంచి 10శాతం నిధులను సంక్షేమ నిధి కోసం వసూలు చేయాలని కర్ణాటక సర్కారు ఈ బిల్లు రూపొందించింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన అనంతరం.. గవర్నర్ వద్దకు ప్రభుత్వం ఈ బిల్లును పంపించింది. సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుం డగా ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించగలరా అంటూ గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ ప్రశ్నించారు. తగిన వివరణ ఇవ్వాలని సర్కారును కోరుతూ బిల్లును గురువారం తిప్పి పంపారు. దేవాదాయశాఖ పరిధిలోని దేవాలయాల అభివృద్ధి, పురోహితులకు జీతభత్యాల కోసం ఈ సంక్షేమ నిధిని వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. గవర్నర్ సూచన ప్రకారం వివరణ ఇస్తామని ఆయన పేర్కొన్నారు.