
187views
ఉగ్రవాదులకు నిధుల అందజేత కేసులో తిహాడ్ జైలులో ఉన్న కశ్మీర్ వేర్పాటువాది షబీర్ అహ్మద్ షా కుమార్తె సమా షబీర్ (23), పాకిస్థాన్ మద్దతుదారైన దివంగత సయ్యద్ అలీ షా గిలానీ మనవరాలు రువా షా తాము వేర్పాటువాద భావజాలం వీడుతున్నట్లు ప్రకటించారు. భారతదేశ సార్వభౌమాధికార పరిధిలో విధేయులైన పౌరులుగా నడుచుకుంటామని తెలిపారు. ఈ మేరకు స్థానిక వార్తాపత్రికల్లో వీరి పేరిట పబ్లిక్ నోటీసులు ప్రచురితమయ్యాయి. తన తాత స్థాపించిన హురియత్ కాన్ఫరెన్స్ నుంచి తానంతట తాను తప్పుకొంటున్నట్లు రువా షా స్పష్టం చేశారు. అలాగే తన తండ్రి స్థాపించిన వేర్పాటువాద డెమోక్రటిక్ ఫ్రీడం పార్టీ (డీఎఫ్‌పీ) నుంచి తప్పుకొంటున్నట్లు సమా షబీర్ పేర్కొన్నారు. ఈమె గతంలో సీబీఎస్‌ఈ కశ్మీర్ టాపర్‌గా నిలిచారు. అప్పట్లో బ్రిటన్‌లో లా చదువుతున్న సమాకు 2019లో ఈడీ సమన్లు జారీ చేసింది.





